CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.

  • షరతులపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు బెయిల్..
  • 8 రోజులు తర్వాత తీహార్ జైలు నుంచి విడుదల..
  • శాంతిభద్రతలకు భంగం కలిగించమని కోర్టుకు హామీ..
Cjp (2)

Cjp (2)

CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన తెలిపినందుకు ఢిల్లీ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారం రోజుల తర్వాత వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.అయితే, షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

  • సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఒక్కొక్కరు రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో పాటు పూచీదారుల్ని కూడా సమర్పించారు.
  • శాంతిభద్రతలకు భంగం కలించకూడదని, శాంతిని కాపాడుతామని విఘాతం కలిగించే చర్యలకు పాల్పడబోమని లిఖితపూర్వక హామీ ఇచ్చారు.
  • జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వకూడదని, ఆ ప్రదేశం మళ్లీ అధికారికంగా నిరసన స్థలంగా ప్రకటించే వరకు అక్కడ నిరసనలకు ప్రజల్ని సమీకరించబోమని హామీ ఇచ్చారు.
  • రాజ్యాంగ పరిధిలోనే నిరసనలు తెలుపాలని, భవిష్యత్తులో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలకు రాజ్యాంగ పరిధిలోనే ఉండేలా చూస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
  • కేసుకు సంబంధించిన ప్రతీ విచారణ తేదీన ఇద్దరూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.