CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..

  • కుటుంబానికి భద్రతా ముప్పు ఉందన్న CJP నేత సౌరవ్ దాస్.
  • ఇంట్లోకి యూట్యూబర్లు చొరబడ్డారని ఆరోపణ.
  • ఇంటి బయట 15-20 మంది గుమిగూడారని వెల్లడి.
  • ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నానని తెలిపిన సౌరవ్ దాస్.
Cjp's Saurav Das

Cjp's Saurav Das

CJP: కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్ తన కుటుంబానికి తీవ్ర భద్రతా ముప్పు ఉందని ఆరోపించారు. కొందరు యూట్యూబర్లు తన ఇంట్లోకి చొరబడ్డారని, మరికొందరు ఇంటి బయట గుమిగూడారని ఆయన ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన సౌరవ్ దాస్.. బుధవారం 15 నుంచి 20 మంది తన ఇంటి వద్దకు వచ్చారని, వారిలో కొందరు మంగళవారం రాత్రి నుంచే తన ఇంటి బయట ఉన్నారని తెలిపారు.

యూట్యూబర్లు తన ఇళ్లు, వ్యక్తిగత జీవితం, జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ వ్యతిరేక ఉద్యమంలో తన పాత్ర గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియోల కారణంగా అసాంఘిక శక్తులు చురుకుగా మారే అవకాశం ఉందని, తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను సీజేపీ 2 రోజుల సమావేశాల కోసం మహారాష్ట్రలో ఉన్నానని, ఈ సమయంలో తన కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన మరింత పెరిగిందని సౌరవ్ దాస్ పేర్కొన్నాడు.