Site icon NTV Telugu

Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల

Results

Results

సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది.  అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల నుంచి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 12వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు, శృతి రాజ్యలక్ష్మీ 25వ ర్యాంక్, రవికుమార్ 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి 56వ ర్యాంకు, పాణిగ్రాహి కార్తీక్ 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్ 117వ ర్యాంక్, అరుగుల స్నేహ 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్, చైతన్య రెడ్డి 161వ ర్యాంక్, దొంతుల జీనత్‌చంద్ర 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డి 214వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.

Exit mobile version