NTV Telugu Site icon

Delhi: ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్.. జవాన్లు ఏం చేశారంటే..!

Delhiairport

Delhiairport

ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో సమీపంలో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో కొన్ని సెక్షన్లు అయోమయానికి గురయ్యారు. అక్కడే ఉన్న జవాన్లు స్పందించి సీపీఆర్ చేశారు. ఇద్దరు ముగ్గురు అతడి దగ్గరే కూర్చుని సపర్యాలు చేశారు. అనంతరం సకాలంలో ఆస్పత్రిక తరలించి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అర్షిద్‌ అయూబ్‌ అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీనగర్‌ వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్‌ 2 దగ్గర లగేజీ ట్రాలీ పట్టుకుని ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతడికి సకాలంలో సీపీఆర్‌ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటనే బాధితుడు తేరుకున్నాడు. ప్రాణాలను కాపాడిన జవాన్లను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ప్రయాణికుడు ఇండిగో విమానంలో శ్రీనగర్‌కు వెళ్లేందుకు వచ్చాడని సీఐఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. హ్యాండ్‌ ట్రాలీ స్టాండ్‌ దగ్గర అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో.. అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు తక్షణమే స్పందించారన్నారు. జవాన్‌ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తతతో పాటు సత్వరం చర్యలు తీసుకోవడం వల్ల ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టగలిగారని అభినందించారు.