Site icon NTV Telugu

China: చైనా రెచ్చగొట్టే చర్య.. వాస్తవాధీన రేఖ వద్దకు యుద్ధ విమానాలు

Chinese Fighter Jets

Chinese Fighter Jets

China: సరిహద్దుల్లో కొద్ది రోజల వరకు కిమ్మనకుండా ఉన్న చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు నిబంధనలను అతిక్రమించింది. కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల తర్వాత కూడా, చైనా యుద్ధ విమానాలు తూర్పు లద్ధాఖ్‌లో మోహరించి భారత బలగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో వాస్తవాధీన రేఖకు దగ్గరగా డ్రాగన్‌కు చెందిన విమానాలు ఎగురుతూనే ఉన్నాయి. ఇలా విమానాలు ఎగరడం ఆ ప్రాంతంలోని భారత రక్షణ యంత్రాంగాన్ని పరిశోధించే చర్యగా పరిగణించవచ్చు. భారత వైమానిక దళం పరిస్థితులకు తగ్గట్లుగా ప్రతిస్పందిస్తోంది. జే-11తో సహా చైనా యుద్ధ విమానాలు వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఎగురుతూనే ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో 10 కిమీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ రేఖను ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయని తెలిపాయి.

Monkeypox Cases: ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, కరోనా.. అధికారుల హైఅలర్ట్

ఈ రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం గట్టి చర్యలు చేపట్టింది. మిగ్-29,మిరాజ్ 2000తో సహా అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను స్థావరాలకు తరలించింది. చైనా చర్యలకు నిమిషాల్లోనే సమాధానం చెప్పొచ్చని అధికారిక వర్గాలు ప్రకటించాయి. డ్రాగన్‌ ముప్పును అధిగమించడానికి భారత వైమానిక దళం ఫైటర్ జెట్‌లను సిద్ధం చేసింది. చైనీస్ విమానాలను భారత దళాలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. జూన్‌ చివరి వారంలో చైనా యుద్ధ విమానం ఎల్‌ఏసీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు తిరిగింది. దీంతో భారత రాడార్‌లు గుర్తించి అలెర్ట్‌ చేశాయి. వెంటనే భారత ఫైటర్‌ జెట్స్‌ రంగంలోకి దిగడంతో చైనా యుద్ధ విమానం తోక ముడిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. చైనా యుద్ధ విమానాలను సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కి దగ్గరగా గుర్తించిన వెంటనే తాము చాలా వేగంగా స్పందిస్తామని, ఫైటర్‌ విమానాలతోపాటు అన్ని వ్యవస్థలను హై అలెర్ట్‌ చేస్తామని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) చీఫ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి తెలిపారు

Exit mobile version