NTV Telugu Site icon

China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్‌పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్

China India Relations

China India Relations

China warns US not to interfere in its relationship with India: భారత్-యూఎస్ఏ మిలిటరీ డ్రిల్స్‌పై డ్రాగన్ కంట్రీ చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. చైనా సరిహద్దుల్లోని ఎల్ఏసీకి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఇరు దేశాల సైనిక విన్యాసాలు జరగడంపై అభ్యంతరం తెలిపింది. భారత్-అమెరికా దేశాలు ఎల్ఎసీకి సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘యుధ్ అభ్యాస్’పేరుతో మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఈ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇది తనకు ప్రమాదంగా భావిస్తోంది జిత్తులమారి చైనా. ఈ యుద్ధ విన్యాసాలను తాము వ్యతిరేకిస్తున్నట్లుగా బుధవారం చైనా తెలిపింది. భారత్-చైనాల మధ్య జరిగిని 1993,1996 ఒప్పందాల స్ఫూర్తిని ఉల్లంఘించడమే అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ పేర్కొన్నాడు.

Read Also: Wedding: పెళ్లి మండపంలోనే ఆగలేకపోయిన వరుడు.. అందరూ చూస్తుండగానే..

శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు, నైపుణ్యాలను పెంచుకునేందుకు అమెరికా, భారత్ దేశాలు ఈ జాయింట్ మిలిటరీ విన్యాసాలను ప్రారంభించాయి. ఇది భారత్-చైనా పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. మే 2020లో పెద్ద ఎత్తున లడఖ్ లోని ఎల్ఏసీకి పీపుల్ లిబరేషన్ ఆర్మీని పంపిన చైనా.. 1993,1996 ఒప్పందాల గురించి మాట్లాడటం ఆసక్తిగా మారింది. ప్రతీ సంవత్సరం భారత్, యూఏస్ఏ సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి. జూన్ 2020లో జరిగిన గల్వాన్ ఘర్షన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం జరుగుతోంది 18 ఎడిషన్ యుద్ధాభ్యాస్. అంతకుముందు అక్టోబర్ 2021లో యూఎస్ఏలోని అలస్కాలో జాయిండ్ బేస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్ సన్ లో ఇలాగే ఇరు దేశాలు యుద్ధ విన్యాసాలు చేశాయి.

ఇదిలా ఉంటే భారత్-చైనా సంబంధాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చినట్లు పెంటగాన్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న జాయింట్ మిలిటరీ విన్యాసాలు చైనాను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పోలిస్తే చైనా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు దిగజారింది. దీనికి తోడు చైనా ప్రజలు జి జిన్‌పింగ్ నాయకత్వానికి, కోవిడ్-19 ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్ ఉద్యమిస్తున్నారు. ఈ సమయంలోనే లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఏల్ఏసీ) వద్ద భారత్-అమెరికాలు యుద్ధ విన్యాసాలు చేయడం చైనాను కలవరపరుస్తున్నాయి. దీనికి తోడు గల్వాన్ ఘర్షణ సమయంలో, ఆ తరువాత భారత సైనిక శక్తిని దగ్గర నుంచి చూసింది చైనా ఆర్మీ. అప్పటి నుంచి సరిహద్దుల్లో డ్రాగన్ దేశ కవ్వింపులకు కొద్దిగా అడ్డుకట్టపడింది.