Site icon NTV Telugu

China Terms India’s Strikes: పాకిస్తాన్పై భారత్ దాడులను తప్పుబట్టిన చైనా!

Chaina

Chaina

China Terms India’s Strikes: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు. ఈ పరిస్థితి గురించి మేము ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని మేము రెండు దేశాలను కోరుతున్నామని తెలిపారు. భారత్ తక్షణమే “ఆపరేషన్ సింధూర్” ను నిలిపి వేయాలని బీజింగ్ ప్రతినిధి కోరారు.

Read Also: Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రూ. 500 పెరిగిన పసిడి ధర

అయితే, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకుల హత్యకు ప్రతీకారంగా భారత్ ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ల స్థావరాలపై క్షిపణి దాడుల చేసింది భారత వైమానిక దళాలు. 26/11 ముంబై దాడులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు (అజ్మల్ కసబ్ శిక్షణతో సహా), మురిద్కే (పాకిస్తాన్ పంజాబ్) ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు చేసినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని వైమానిక రక్షణ విభాగాలను అప్రమత్తం చేసినట్లు భారత సైనిక దళం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ముందస్తుగా అమెరికా, రష్యా, యుకే, యూఏఈ, సౌదీ అరేబియాతో సహా అనేక ప్రముఖ దేశాలను దాడుల గురించి వివరించింది భారతదేశం.

Exit mobile version