Site icon NTV Telugu

United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు

Pakistan Terrorist

Pakistan Terrorist

China Puts On Hold India, US’ Move At UN To Blacklist Hafiz Saeed’s Son: లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీస్ సయీద్ కుమారుడు పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ తలా సయీద్ ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా బుధవారం నిలుపుదల చేసింది. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచింది చైనా. ఈ ఏడాది ఏప్రిల్ లో భారత ప్రభుత్వం హఫీస్ తలా సయీద్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద హఫీజ్ తలా సయీద్ ను చేర్చే ప్రతిపాదనను చైనా హోల్డ్ లో పెట్టింది. అంతకుముందు రోజు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా నాయకుడు షాహిద్ మహమూద్ విషయంలో కూడా చైనా ఇలాగే చేసింది. హఫీజ్ తలా సయీద్ భారతదేశంలో లష్కరేతోయిబా కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిధులును సేకరిస్తున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, ఇతర పాశ్చాత్య దేశాల్లో భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు.

Read Also: Man turns Cooler on: ఆయన కూలర్ ఆన్ చేశాడు.. ఆమెకు కాలింది.. కట్ చేస్తే..

2016లో షాహీద్ మహమూద్ ను యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఇతడు పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్నాడు. 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద పాకిస్తాన్ ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనలను చైనా అడ్డుకోవడం నాలుగు నెలల్లో ఇది ఐదోసారి. గతంలో జూన్ నెలలో పాకిస్తాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని బ్లాక్ లిస్టులో చేర్చే భారత ప్రతిపాదనను కూడా చైనా చివరి నిమిషంలో అడ్డుకుంది. ఇతడు హఫీస్ సయీద్ బావమరిది. ఆగస్టులో జైషే మహ్మద్ ఉ్గ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ ను బ్లాక్ లిస్టులో చేర్చే ప్రతిపాదను కూడా ఇలాగే చైనా నిలిపి వేసింది. ముంబై దాడి కేసులో ఇతడి ప్రమేయం కూడా ఉంది.

చివరి సారిగా మే 2019లో పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ ను ‘‘ గ్లోబర్ టెర్రరిస్టు’’గా గుర్తించడంలో భారత్ దౌత్య విజయాన్ని సాధించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటే చైనా మాత్రమే తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంటూ భారత ప్రయత్నాలను అడ్డుకుంటోంది. చైనాతో పాటు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాాలుగా ఉన్నాయి.

Exit mobile version