Site icon NTV Telugu

Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్.. ఆత్మాహుతి దాడితో కీలక ప్రాజెక్టులు నిలిపివేత..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అయితే, ఈ పరిణామంపై చైనా తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం పాక్-చైనా స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పలు ప్రాజెక్టును చైనా నిలిపేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రెండు డ్యామ్ ప్రాజెక్టుల పనులు నిలిపివేసినట్లు ప్రావిన్షియన్ అధికారి శుక్రవారం తెలిపారు. దాదాపుగా 1250 మంది చైనీస్ పౌరులు పనిచేస్తున్న ప్రాజెక్టుల్లో పని ప్రారంభం కావాలంటే పాక్ అధికారులు కొత్త భద్రతా ప్రణాళికలతో ముందుకు రావాలని కంపెనీ కోరినట్లు అధికారులు తెలిపారు. చైనీస్ కార్మికుల భద్రత రెండు దేశాలకు ప్రధాన ఆందోళన అని పాకిస్తాన్ భావిస్తోంది.

Read Also: K.Keshava Rao : నేను 55 ఏళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నా.. నన్ను cwc మెంబర్‌గా చేసింది కాంగ్రెస్

మూడు రోజుల క్రితం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో దాసు డ్యామ్ పనుల్లో పాల్గొంటున్న చైనీయులు ప్రయాణిస్తున్న వాహనం ఆత్మాహుతి దాడికి గురైంది. ఆత్మాహుతి బాంబర్ ఢీకొట్టడంతో ఐదుగురు చైనా జాతీయులతో పాటు పాకిస్తాన్ డ్రైవర్ మరణించాడు. దాసు డ్యామ్‌ని నిర్మిస్తున్న చైనా గెజౌబా గ్రూప్ కంపెనీ పనులని నిలిపేసపింది. దాసు డ్యామ్ ప్రాజెక్టులో మొత్తం 750 మంది వరకు చైనీస్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. 500 మంది డయామర్ భాషా డ్యామ్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు.

చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతోంది. పాకిస్తాన్‌లో సీపెక్ ప్రాజెక్టు చేపట్టింది. గ్వాదర్ పోర్టు డెవలప్‌మెంట్‌తో పాటు రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, డ్యామ్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో చైనా నుంచి వచ్చిన ఇంజనీర్లు పనిచేస్తు్న్నారు. అయితే, తరుచుగా పాకిస్తాన్ లోని బలూచ్ మిలిటెంట్లతో పాటు పాక్ తాలిబాన్లు చైనీయులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో గ్వాదర్ పోర్టు, బలూచిస్తాన్‌లోని పాక్ ఎయిర్ స్టేషన్ దాడులకు గురయ్యాయి.

Exit mobile version