India-China: అమెరికన్ సుంకాలు, ట్రంప్ తీరుతో భారత్, చైనాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో మోడీ, జిన్ పింగ్ మధ్య సమావేశాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ప్రధాని మోడీకి చైనా ఘన స్వాగతం పలికింది. ఇదే సమయంలో పుతిన్, మోడీ, జిన్ పింగ్ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే, తాజాగా చైనా భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పంది. అమెరికా భారతీయ ఫార్మాను దెబ్బతీసే విధంగా 100 శాతం సుంకాల విధింపు ప్రకటన తర్వాత, చైనా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 30 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. భారతీయ ఔషధ తయారీదారులు ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా చైనాకు మందుల్ని ఎగుమతి చేయడానికి వీలు కలుగుతుంది. ఈ నిర్ణయం రాబోయే ఏళ్లలో భారతీయ ఫార్మా ఎగుమతులను బిలియన్ డాలర్లకు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔషధ దిగుమతులపై 100 శాతం సుంకాన్ని విధించిన వెంటనే ఈ ప్రకటన వచ్చింది. ట్రంప్ నిర్ణయం భారతీయ ఫార్మాను దారుణంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు చైనా నిర్ణయం వల్ల భారతీయ కంపెనీలకు సరసమైన ధరలకు ప్రత్యామ్నాయంగా చైనీస్ మార్కెట్‌ని అందిస్తుంది.
భారతదేశాన్ని ‘ప్రపంచ ఫార్మసీ’గా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా సరసమైన జనరిక్ మందులు మరియు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తుంది. ఇప్పుడు చైనా సున్నాకు సుంకాన్ని తగ్గించడంతో భారీ జనాభా ఉన్న ఆ దేశ మార్కెట్‌ని ఇండియన్ కంపెనీలు అందిపుచ్చుకోనున్నాయి. ఈ చర్య భారత్, చైనా వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు.
