Doklam issue: డోక్లాం సమీపంలో గ్రామాలను నిర్మిస్తోన్న చైనా..
- డోక్లాంలో గ్రామాలు నిర్మిస్తున్న చైనా..
- భూటాన్ భూభాగాన్ని ఆక్రమించి నిర్మాణాలు..
- భారత్‌కి ఆందోళనకర పరిణామాలు..
- డోక్లాంకి సమీపంలో ‘‘సిలిగురి కారిడార్’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doklam issue: మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది.
డోక్లామ్ పీఠభూమి భూటాన్ భూభాగం. ఈ ప్రాంతం భారత్‌కి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఈ పీఠభూమికి సమీపంలోనే అత్యంత కీలమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ ఉంది. ఈ కారిడార్ ఈశాన్య భారతాన్ని, మిగిలిన దేశంతో కలుపుతోంది. భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని డోక్లామ్ సమీపంలో ఉన్న ఈ గ్రామాలను చైనా తన సొంత గ్రామాలుగా చెప్పుకుంటోంది. వాటిలో చాలా వరకు సైనిక ఔట్‌పోస్టులు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో అతిపెద్దది ‘‘జివు’’. ఇది పశ్చిమ సెక్టార్‌లోని త్షేతాంగ్‌ఖా అని పిలువబడే సాంప్రదాయ భూటాన్ పచ్చికభూమిపై నిర్మించబడిందని నివేదికలు తెలుపుతున్నాయి.
Also Read
- IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- CM Yogi Adityanath: దేశానికి "ధర్మ హింస" అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
- NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
- DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
Read Also: Folk Singer Suicide: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
2017లో భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం ఏర్పడింది. రెండు దేశాల బలగాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. చైనా నిర్మిస్తున్న హైవేని, ఇతర మౌలిక సదుపాయాలను భారత్ అడ్డుకుంది. ‘‘ఫోర్స్‌ఫుల్ డిప్లమసీ’’ పేరుతో వెల్లడైన రిపోర్టులో చైనా భూటాన్‌కి చెందిన 2 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోకి అధికారులు, నిర్మాణ కార్మికులు, సరిహద్దు పోలీసులు, సైనిక సిబ్బందిని తరలించింది.
చైనా నిర్మాణాలు భారత్‌కి ఆందోళన కలిగించేవే. చైనా చర్యలు భూటాన్‌తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చైనాలో భారత మాజీ రాయబారి అశోక్ కాంత అన్నారు. చైనా చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూటాన్‌తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చెప్పారు. వాస్తవాలను క్రమంగా మార్చే పనిలో చైనా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
-
CM Yogi Adityanath: దేశానికి “ధర్మ హింస” అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
-
NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
-
DK Shivakumar: జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఆ రోజే ఎందుకంటే?
-
Rajasthan: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..