Site icon NTV Telugu

Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్..

Iraqi Airways

Iraqi Airways

Iraqi Airways: ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బుధవారం కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాన్ని దారి మళ్లించారు.

Read Also: Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష

విమానంలో 100 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. విమానం చైనాలోని గ్వాంగ్ జౌకు వెళ్తున్న విమానాన్ని కోల్‌కతాకు దారి మళ్లించారు. డెకాన్ సమీర్ అహ్మద్ అనే ప్రయాణికురాలు విమానంలో పడిపోయాడు. దీంతో బుధవారం ఉదయం 10.18 గంటలకు విమానం అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ (APHO)కి చెందిన వైద్య బృందం, ఆమెను పరీక్షించి పల్స్ లేదని తేల్చారు.

Exit mobile version