Iraqi Airways: ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్‌వేస్ విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలోని ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బుధవారం కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాన్ని దారి మళ్లించారు.