Site icon NTV Telugu

Netflix: లైంగిక కంటెంట్‌పై నెట్‌ఫ్లిక్స్‌కి బాలల హక్కుల సంఘం సమన్లు..

Netflix

Netflix

Netflix: మైనర్లకు అందుబాటులో “లైంగిక అసభ్యకరమైన కంటెంట్” ఉంచుతున్నారనే ఆరోపణలపై బాలల హక్కుల సంఘం నెట్‌ఫ్లిక్స్‌కి సమన్లు జారీ చేసింది. అసభ్యకరమైన కంటెంట్ చూపుతున్నారని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సోమవారం నెటిఫ్లిక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. అయితే, ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం స్పందించలేదు. మంగళవారం నెట్‌ఫ్లిక్స్ అధికారులకు రాసిన లేఖలో మైనర్లకు అందుబాటులో అసభ్యకరమైన లైంగిక కంటెంట్ ఉంచడం ‘‘లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం-2012’’ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.

Read Also: Pakisthan: ఉగ్రవాద సంస్థను నడిపినట్లు దోషిగా తేలిన అంజెమ్ చౌదరికి జీవిత ఖైదు..

ఇదే విషయంపై గతంలో జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని NCPCR తెలిపింది. తాజాగా సీపీసీఆర్ 2005 సెక్షన్ 14 ప్రకారం జూలై 29 మధ్యాహ్నం 03 గంటలకు ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలతో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని లేఖలో ఆదేశించింది.

Exit mobile version