Site icon NTV Telugu

Arun Kumar Sinha: SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారి అరుణ్ కుమార్ సిన్హా మరణం

Arun Kumar Sinha

Arun Kumar Sinha

Arun Kumar Sinha: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా మరణించారు. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు. 2016 నుంచి ఆయన ఎస్పీజీ గ్రూప్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధానుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Read Also: Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..

61 ఏళ్ల అరుణ్ కుమార్ సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా ఎస్పీజీ చీఫ్ గా ఉన్నారు. తాజాగా ఆయన సర్వీసును పొడగించారు. ఇంతలోనే ఆయన మరణించారు.

జార్ఖండ్ లో సిన్హా తన విద్యను పూర్తి చేశారు. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పలు ఉన్నత స్థాయిల్లో పనిచేశారు. డీసీపీ కమిషనర్, ఐజీ, ఇంటలిజెన్స్ ఐజీ, తిరువనంతపురంలో అడ్మినిస్టేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. అరుణ్ కుమార్ సిన్హా లా అండ్ ఆర్డర్ ఇంఛార్జ్ గా ఉన్న సమయంలో మాల్డీవుల ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ ని హతమర్చేందుకు ప్రయత్నిస్తున్న మాస్టర్ మైండ్ ని తిరువనంతపురంలో పట్టుకున్నారు. ప్రధానికి, ప్రెసిడెంట్ కి ఈమెయిళ్ల ద్వారా వచ్చిన బెదిరింపుల కేసుల్లో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఎస్పీజీ చాల ముఖ్యమైన భద్రతా దళం. ఇది ప్రధాని, మాజీ ప్రధానుల భద్రను చూస్తుంది. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ఈ గ్రూప్ ఏర్పడింది. 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎస్పీజీలో 3000 మంది ఉన్నారు.

Exit mobile version