Ram Mandir: అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా, సినీ, వ్యాపారవేత్తలు, సాధువులకు రామమందిర ట్రస్ట్ ఆహ్వానాలనున పంపింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేడుకకు అరుదైన వ్యక్తి ఆహ్వానం అందింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ సంతోషి దుర్గకు రామాలయ ట్రస్ట్ ఆహ్వానం పంపింది.
700కి పైగా పోస్టుమార్టంలలో సహాయపడిన మహిళా శవపరీక్ష సహాయకురాలిగా పనిచేసిన 35 ఏళ్ల మహిళ సంతోషి దుర్గను జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. సంతోషి దుర్గ నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపుగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలో 700కి పైగా శవపరీక్షల్లో ఆమె సాయపడ్డారు. ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుంచి ఆమెకు ప్రశంసలు దక్కాయి.
ఈ ఆహ్వానాన్ని తన జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించలేదని.. నా జీవితంలో నన్ను కూడా అయోధ్యకు పిలుస్తారని అనుకోలేదని, రాముడి ఆహ్వాన లేఖ పంపి నన్ను పిలిచారని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ లేఖతో తాను ఆశ్చర్యపోయానని.. తన కళ్ల నుంచి ఆనందంతో కన్నీల్లు వచ్చాయని వెల్లడించారు. ఆహ్వాన పత్రం పంపినందుకు సంతోషి దుర్గ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: China Manja : ఆర్మీ జవాన్ ప్రాణం బలిగొన్న చైనా మాంజా
తాను జనవరి18న నర్హర్‌పూర్ నుండి బయలుదేరి, అయోధ్యలోలో ప్రాణప్రతిష్ట జరిగే సమయానికి హాజరవుతానని, నర్హర్ పూర్ ప్రజల సంతోషం, శాంతి, అభివృద్ధి కోసం శ్రీరాముడిని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. నర్హర్‌పూర్ BMO ప్రశాంత్ కుమార్ సింగ్ కూడా శ్రీమతి సంతోషిని అభినందించారు మరియు ఆమెకు అయోధ్య నుండి ఆహ్వాన పత్రం అందడం మాకు గర్వకారణమని అన్నారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి రామాలయ ఉద్యమంలో పాల్గొన్న కరసేవకులు, న్యాయవాదులు, హిందూ సాధువులు, జైన-బౌద్ధ-సిక్కు వర్గాలకు చెందిన వ్యక్తులకు, గిరిజన సంఘాల నాయకులకు, మీడియా ప్రముఖులకు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర మరియు పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకు , సైన్యం యొక్క త్రి-సేవల విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి.