ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఎయిర్‌పోర్టులో దారుణం.. తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో కులాహిలోని రియల్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం శక్తివంతమైన పేలుడు సంభవించింది. సంఘటనాస్థలిలో ఏడుగురు కార్మికులు సజీవదహనం కాగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా అధికారలు తెలిపారు. కార్మికులు కొలిమి దగ్గర శుభ్రపరిచే పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లుగా చెప్పారు. పేలుడుపై ప్లాంట్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గాయపడిన కార్మికుల పరిస్థితి గురించి వివరాలు వెల్లడించలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్లాంట్‌లోని భద్రతా ప్రొటోకాల్‌లను.. ఫర్నేస్ పేలుడుకు దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: శాంతించిన బంగారం, వెండి ధరలు.. కలిసొచ్చిన ఈయూ ప్రకటన
