NTV Telugu Site icon

Chhattisgarh: ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా ప్రాణాలు తీసుకున్న యువతి

Sucide

Sucide

ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగా ఓ యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 20 మంది ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనల ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో చోటుచేసుకుంది.

అంకుర్ నాథ్(21) అనే యువతి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. సోషల్ మీడియాకు బానిసైంది. రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇదే ఆమె వ్యాపకం అయిపోయింది. రాయ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాగర్ పట్టణంలో అంకుర్ నాథ్ తన అక్కతో కలిసి నివసిస్తోంది. అయితే గత సోమవారం (డిసెంబర్ 30, 2024) ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉండగా.. దాదాపు 20 మందికిపైగా ఫాలోవర్లు చూస్తుండగా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో లైవ్‌లో ఉన్నవారంతా భయకంపితులయ్యారు. ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. ఇంటి డోర్ పగులగొట్టి లోపలి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చేయ్యి దాటిపోయింది. ఆమె ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో ఒక ఫాలోవర్ షాక్‌లోకి వెళ్లిపోయాడు.

ఇది కూడా చదవండి: Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?

సోమవారం జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ప్రేమలో హార్ట్‌బ్రేక్ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తూ ఉంటుందని వెల్లడించారు. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నామని.. లోతుగా విచారిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కుమార్తె మరణవార్త తెలిసి షాక్ అయిపోయారు.

ఇది కూడా చదవండి: Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్

Show comments