Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పాటైన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా ప్రారంభోత్సవంతో మనేంద్రగఢ్ నివాసి రామశంకర్ గుప్తా సంకల్పం కూడా నెరవేరింది. ఆ సంకల్పం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మనేంద్రగఢ్‌ను జిల్లా చేసేంతవరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేసిన రామశంకర్ గుప్తా.. 21 ఏళ్ల తర్వాత జిల్లా ఏర్పాటు కావడంతో గడ్డాన్ని తొలగించాడు. మనేంద్రగఢ్ జిల్లా అయ్యే వరకు, కలెక్టర్-ఎస్పీ బాధ్యతలు స్వీకరించే వరకు గడ్డం తీయబోనని గడ్డం పెంచాడు. శుక్రవారం ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మనేంద్రగఢ్‌లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా మొదటి కలెక్టర్ ధ్రువ్, ఎస్పీ తిలక్ రామ్ కోషిమా బాధ్యతలు స్వీకరించారు. దీంతో రామశంకర్ గుప్తా తన గడ్డం గీసుకున్నాడు. కొరియా జిల్లా నుంచి మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్‌లను విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నామని రామశంకర్ గుప్తా తెలిపారు. 15 ఆగస్టు 2021న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కొత్త జిల్లా మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్‌ను ప్రకటించారు. ఆయన భావోద్వేగంతో రెండు మాటలు చెప్పారు. ‘కొత్త జిల్లా ఏర్పాటు కోసం చాలామంది పోరాడారు. వారిలో కొందరు మరణించారు’ అని రామశంకర్ గుప్తా తెలిపారు.
Delhi: ఢిల్లీలో ఆప్ సర్కారుకు కొత్త చిక్కు.. బస్సుల కొనుగోళ్లలో గోల్‌మాల్!
1999లో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనేంద్రగఢ్‌ను జిల్లాగా చేయాలనే డిమాండ్ తీవ్రమైంది. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మనేంద్రగఢ్ జిల్లాను ఏర్పాటు చేసేంత వరకు తాను గడ్డం తీయను అని రామశంకర్ గుప్తా ప్రతిజ్ఞ చేశారు. రామశంకర్ సంకల్పం నెరవేరడానికి 21 ఏళ్లు పట్టింది. ఆగస్టు 15న జిల్లాను ప్రకటించిన తర్వాత ఆయన గడ్డం పూర్తి చేసుకున్నారు. దీంతో శుక్రవారం జిల్లాకేంద్రం ప్రారంభోత్సవంఅనంతరం గడ్డం గీయించుకున్నారు. కొరియా జిల్లాకు చెందిన రామశంకర్ గుప్తా ప్రసిద్ధ ఆర్టీఐ కార్యకర్త. 1999లో మనేంద్రగఢ్‌లోని గాంధీ చౌక్ వద్ద నిరసన ప్రదేశంలో గడ్డం తీయకూడదని ప్రతిజ్ఞ చేశారు. శుక్రవారం, అదే నిరసన ప్రదేశంలో డిమాండ్ నెరవేరడంతో గడ్డం తీయించుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొరియా జిల్లా నుంచి వేరుచేసి మనేంద్రగఢ్ – చిర్మిరి – భారత్‌పుర్ (ఎంసీబీ) ప్రాంతాలను 32వ జిల్లాగా ప్రకటించింది.