Site icon NTV Telugu

Helmets: కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్టులుగా “హెల్మెట్లు”

Helmats

Helmats

Helmets: తన కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు వినూత్నమైన గిఫ్ట్స్ అందించాడు ఆ తండ్రి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వివాహానికి వచ్చిన వారికి ఉచితంగా హెల్మెట్లను గిఫ్టులుగా ఇచ్చాడు. ఛత్తీస్‌గఢ్ కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం జరిగిన తన కుమార్తె పెళ్లిలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశారు.

Read Also: Kane Williamson: రికార్డు బద్దలు కొట్టనున్న కేన్ విలయమ్సన్.. వరుస సెంచరీలతో..!

స్పోర్ట్స్ టీచర్ అయిన సెద్ యాదవ్ కూతురు నీలిమకి సరన్‌గఢ్-బిలైగఢ్ జిల్లాలోని లంకాహుడా గ్రామానికి చెందిన ఖమ్‌హాన్ యాదవ్‌తో వివాహం జరిగింది. బైక్స్‌పై వివాహానికి వచ్చిన అతిథులకు వధువు తండ్రి రిటర్న్ గిఫ్ట్స్‌గా హెల్మెట్లను అందించి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనిపై సెద్ యాదవ్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి నా కుమార్తె పెళ్లిన మంచి సందర్భంగా భావించానని, మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, జీవితం చాలా విలువైందని, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ హెల్మెట్లను ధరించాలని చెప్పానని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తమ కుటుంబంలోని 12 మంది హెల్మెట్లను ధరించి డ్యాన్సులు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. స్వీట్లతో పాటు 60 మంది అతిథులకు హెల్మెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

Exit mobile version