Site icon NTV Telugu

Chattigarh: మరీ ఇలా తయారేంట్రా.. రీల్స్ కోసం ఇంతగణమా…

Untitled Design (6)

Untitled Design (6)

ఈ మధ్య యువత రీల్స్ కోసం ఏలాంటి పని చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలను కూడా ఫణంగా పెడుతున్నారు. వీళ్లు చేసే దారుణమైన స్టంట్స్ చూసి నెటిజన్లు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. అటువంటి ఘటనే చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో షాకింక్ ఘటన జరిగింది. ఐదుగురు యువకులు స్కూటర్‌పై ప్రమాదకరమైన ఫీట్లు చేశారు. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా హై స్పీడ్‌లో నడుపుతూ.. నలుగురు స్కూటీపై కూర్చుని.. ఐదో వ్యక్తిని గాల్లో ఎత్తుకున్నారు. గతంలో ఓ వ్యక్తి ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశాడు. అతను తన బైక్‌పై నిలబడి, తన ప్రదర్శనను చూపించడానికి ప్రయత్నిస్తూ.. తిరిగి బైక్ పై కూర్చోడానికి ప్రయత్నిస్తుండగా.. ముందున్న కారు ఢీకొట్టింది.

కొంచెం అటు ఇటు అయితే ఐదో వాడి గతి అదో గతి అయ్యుండేదని వీడియో చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా శవాలు లేస్తాయంటూ కామెంట్స్ పెడుతున్నారు

Exit mobile version