Chhangur Baba: జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాబా ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడిలు చేస్తున్న ముఠాకు కీలకంగా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడవుతోంది. హిందూ, సిక్కు మహిళలే లక్ష్యంగా భారీ మతమార్పిడి నెట్వర్క్‌ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది.
బలవంతం, ప్రలోభం ద్వారా 1,500 మందికి పైగా హిందూ మహిళలను మరియు వేలాది మంది ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చినట్లు తెలిసింది. పేదలు, వితంతువులు, నిస్సహాయ మహిళలతో సహా బలహీన వర్గాలను క్రమపద్ధతిలో లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లవ్ జిహాద్ ద్వారా హిందూ, సిక్కు యువతులను, మహిళలను ఇస్లాంలో మార్చేందుకు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తేలింది. కులాల ఆధారంగా హిందూ మహిళల్ని మతం మార్చినవారికి లక్షల్లో రూపాయాలను ఇస్తున్నట్లు వెల్లడైంది.
Read Also: Shocking: హెయిర్ కట్ చేసుకోలేదని తిట్టినందుకు, ప్రిన్సిపాల్‌ని చంపిన విద్యార్థులు..
దేశవ్యాప్తంగా బలమైన నెట్వర్క్ ఉండటంతో పాటు దుబాయ్, ఇతర ముస్లిం దేశాలతో ఛంగూర్‌బాబాకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఏకంగా ఈ మతమార్పిడులకు రూ. 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎక్కువ మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అధికారులు కనుగొన్నారు. మహారాష్ట్రలో విస్తృతమైన నెట్వర్క్ నిర్మించినట్లు యూపీ పోలీసుల విచారణలో తేలింది. గల్ఫ్ ఆధారిత సంస్థల మద్దతుతో అంతర్జాతీయ సిండికేట్‌లో భాగమైనట్లు వెల్లడైంది. మతమార్పిడులు చేసేందుకు బలరాంపూర్, సమీప జిల్లాల్లో ఇస్లామిక్ దవా కేంద్రాలను, మదర్సాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే కాకుండా పోలీసులు, స్థానిక అధికారులకు లంచం ఇచ్చి తన వ్యతిరేకుల నోర్లు మూయించడానికి తప్పుడు కేసులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఛంగూర్ బాబా కొడుకుకు స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, ఎన్ఐఏ, ఐబీ వంటి సంస్థలు విచారిస్తున్నాయి.
