Site icon NTV Telugu

Chenab Bridge: విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా చినాబ్ బ్రిడ్జి.. పైలట్లు ఏం చేస్తున్నారంటే..!

Chenabbridge

Chenabbridge

ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్‌ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.

ఇది కూడా చదవండి: ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!

ప్రస్తుతం విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తున్నాయి. వంతెన సమీపంలోకి రాగానే పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన వచ్చిందంటూ అనౌన్సెమెంట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా అద్దాల్లోంచి చూస్తూ తరిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులంతా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Lizard In Ice-Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. అది ఫ్యాక్టరీలో ప్యాక్ చేశారు.. నేను తయారు చేయలేదు

ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తుండగా పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారని.. ఆ సమయంలో ప్రయాణికులంతా తమ మొబైల్‌లో దృశ్యాలను బంధిస్తున్నారని.. అంతేకాకుండా ఇంజనీర్లు రూపొందించిన అద్భుతాన్ని కొనియాడుతున్నారని తెలిపింది. విమానాలు.. చినాబ్ వంతెన మీదగా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. ఇక ఈ వంతెన చూసేందుకు సమీప ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షిస్తున్నారు. నేలపై నుంచే కాకుండా.. ఇప్పుడు ఆకాశం నుంచి కూడా బ్రిడ్జి ఆకర్షింపబడుతోంది.

చినాబ్ బ్రిడ్జిని ప్రధాని మోడీ జూన్ 6న ప్రారంభించారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు.

 

Exit mobile version