Allahabad High Court: ఇటీవల కాలంలో లివ్-ఇన్ రిలేషన్స్ హత్యలకు దారి తీస్తున్నాయి. చాలా సహజీవనాల్లో ఎవరో ఒకరు మోసపోతున్నారు. ఇదిలా ఉంటే లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన రూపకల్పనగా పని చేస్తోందని పేర్కొంది. తన లివ్-ఇన్ పార్ట్నర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తి బెయిల్ మంజూర్ చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
వివాహం అనేది ఒక వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వం సహజీవనాల ద్వారా అందించబడదని జస్టిస్ సిద్ధార్థ్ తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. ‘‘ప్రతీ సీజన్ లో భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజ ముఖ్య లక్షణంగా ఉండదు’’ అని న్యాయమూర్తి అన్నారు.
Read Also: Rajasthan: దారుణం.. భార్యను నగ్నంగా ఊరేగించిన భర్త..
భారతదేశంలో వివాహ వ్యవస్థ అమలులోని సమయంలోనే లివ్ ఇన్ రిలేషన్స్ సాధారమైనవిగా పరిగణించబడతాయని.. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడే అనేక దేశాల్లో వివాహ వ్యవస్థను రక్షించుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధమైన ధోరణి భవిష్యత్తులో మాకు పెద్ద సమస్యగా మారుతుందని హైకోర్టు పేర్కొంది.
వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రగతి శీల సమాజానికి చిహ్నాలుగా చూపబడుతున్నాయని, అటువంటి వాటికి యువత ఆకర్షితులవుతున్నారని, దీర్ఘకాలిక పరిణామాల గురించి వారికి తెలియడం లేదని హూకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ఏడాది పాటు సహజీవనం చేసిన తర్వాత మహిళ గర్భవతి అయితే, ఆమె పార్ట్నర్ అద్నాన్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని మహిళ వేసిన కేసుపై అలహాబాద్ హైకోర్టు విచారించి ఈ వ్యాఖ్యలు చేసింది.