Site icon NTV Telugu

Davos: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌, ఫడ్నవీస్‌..

Davos

Davos

Davos: తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నారు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌ వెళ్లి.. వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.. అయితే, దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొన్నారు.. గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చకు రాగా.. గ్లోబల్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనే అంశాలపై చర్చించారు..

Read Also: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. సర్కార్‌ నిర్ణయం

Exit mobile version