అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం శనివారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
ఇక ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతుల్ని.. ముఖేష్ అంబానీ.. చంద్రబాబు దంపతులకు పరిచయం చేశారు. చంద్రబాబు ప్రత్యేకంగా అనంత్ అంబానీతో ముచ్చటించారు. నూతన దంపతులైన అనంత్, రాధికను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు.
ఇదిలా ఉంటే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్ షిండే.. చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలిసి పలకరించారు.