Chandigarh University Video Leak Case: అమ్మాయిల వీడియో లీక్ కేసు. యూనివర్సిటీ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh University Video Leak Case: చండీగఢ్ వీడియో లీక్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలను మరో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌కు పంపిందనే వార్తల నేపథ్యంలో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళన చేశారు. హస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో అసభ్యకరమైన రీతిలో వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై చండీగడ్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది.
హాస్టల్‌లో ఉన్న అమ్మాయిల అసభ్యకరమైన వీడియోలు ఏమీ కూడా లేవని.. అవన్నీ వట్టి పుకార్లే అని యూనివర్సిటీ ప్రొ- ఛాన్సలర్ ఆర్ఎస్ బావా అధికారిక ప్రకటనలో వెల్లడించారు. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలకు సంబంధించి ఎంఎంఎస్ లను తన బాయ్ ఫ్రెండ్‌తో పంచుకుందని ఆరోపించబడుతున్న అమ్మాయి ఫోన్‌లో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియో తప్పితే.. ఇంకా వేరే విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు లేవని ఆయన వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థినులు ఎవరూ కూడా వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!
అయితే ఈ ఘటనలో ఓ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించిదనే వార్తల్ని యూనివర్సిటీ కొట్టిపారేసింది. అలాంటిదేం లేదని ప్రకటించింది. విచారణ కోసం సదరు అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు ఆమె సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోహాలీలోని యూనివర్సిటీ విద్యార్థులు శనివారం రాత్రి భారీ నిరసనలు చేపట్టారు. దీనిపై ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు సీఎం భగవంత్ మాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణకు చండీగఢ్ యూనివర్సిటీ పోలీసులకు సహకరిస్తుందని.. వైస్ ఛాన్సలర్ వెల్లడించారు.
No student committed suicide. Preliminary probe reveals that the accused girl had sent her own pics/videos to her boyfriend. No other material found. FIR filed. Police probing it. I appeal to students & parents not to believe in any rumours: Pro-Chancellor, #ChandigarhUniversity pic.twitter.com/eOFeF2xf8P
— ANI (@ANI) September 18, 2022
తాజావార్తలు
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!