Site icon NTV Telugu

Chandigarh University Video Leak Case: అమ్మాయిల వీడియో లీక్ కేసు. యూనివర్సిటీ ట్విస్ట్

Chandigarh University

Chandigarh University

Chandigarh University Video Leak Case: చండీగఢ్ వీడియో లీక్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలను మరో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌కు పంపిందనే వార్తల నేపథ్యంలో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థినులు ఆందోళన చేశారు. హస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో అసభ్యకరమైన రీతిలో వీడియోలు తీశారంటూ విద్యార్థినులు ఆరోపించారు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై చండీగడ్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది.

హాస్టల్‌లో ఉన్న అమ్మాయిల అసభ్యకరమైన వీడియోలు ఏమీ కూడా లేవని.. అవన్నీ వట్టి పుకార్లే అని యూనివర్సిటీ ప్రొ- ఛాన్సలర్ ఆర్ఎస్ బావా అధికారిక ప్రకటనలో వెల్లడించారు. 60 మంది విద్యార్థినుల నగ్న చిత్రాలకు సంబంధించి ఎంఎంఎస్ లను తన బాయ్ ఫ్రెండ్‌తో పంచుకుందని ఆరోపించబడుతున్న అమ్మాయి ఫోన్‌లో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వీడియో తప్పితే.. ఇంకా వేరే విద్యార్థినుల అసభ్యకరమైన వీడియోలు లేవని ఆయన వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యార్థినులు ఎవరూ కూడా వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు.

Read Also: Maharashtra: ప్రభుత్వం చేయలేని పని.. 19 ఏళ్ల యువతి చేసింది..!!

అయితే ఈ ఘటనలో ఓ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించిదనే వార్తల్ని యూనివర్సిటీ కొట్టిపారేసింది. అలాంటిదేం లేదని ప్రకటించింది. విచారణ కోసం సదరు అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు ఆమె సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మోహాలీలోని యూనివర్సిటీ విద్యార్థులు శనివారం రాత్రి భారీ నిరసనలు చేపట్టారు. దీనిపై ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు సీఎం భగవంత్ మాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణకు చండీగఢ్ యూనివర్సిటీ పోలీసులకు సహకరిస్తుందని.. వైస్ ఛాన్సలర్ వెల్లడించారు.

 

Exit mobile version