Site icon NTV Telugu

PM Narendra Modi: చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరు భగత్ సింగ్‌గా మార్పు.. ప్రకటించిన పీఎం మోదీ

Pm Narendra Modi

Pm Narendra Modi

Chandigarh Airport To Be Renamed After Bhagat Singh: చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్పు గురించి హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతుల నేపథ్యంలో విమానాశ్రయం పేరును ‘‘ భగత్ సింగ్’’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా.. చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు.

Read Also: Tammineni Sitaram: క్యాన్సర్ పై మరింత అవగాహన అవసరం

పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చండీగఢ్ విమానాశ్రయం పేరును భగత్ సింగ్ గా మార్చాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కర్ కలాన్ లోనే ప్రమాణస్వీకారం చేశారు. భగవంత్ మాన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మార్చి 23ని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. చండీగఢ్ విమానాశ్రయ పేరు మార్చాలనే ప్రతిపాదని ఇప్పుడే కొత్తగా వచ్చిందేం కాదు. 2016లోనే హర్యానా ప్రభుత్వం పేరును భగత్ సింగ్ గా మార్చాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. ఈ అభ్యర్థనతో కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు హర్యానా ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. ప్రస్తుతం చండీగఢ్ విమానాశ్రయాన్ని ‘మొహాలీ విమానాశ్రయంగా’ వ్యవహరిస్తున్నారు. ఈ విమానాశ్రయం పేరుపై గతంలో 2017లో రాజ్యసభలో చర్చ కూడా జరిగింది. బీజేపీ ప్రభుత్వం భగత్ సింగ్ పేరు పెట్టేందుకు ఇష్టపడటం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Exit mobile version