Site icon NTV Telugu

Census: జనాభా లెక్కల నోటిఫికేషన్ విడుదల.. తొలుత ఏఏ రాష్ట్రాల్లో అంటే..!

Census

Census

దేశంలో జన గణనకు అంకురార్పణ జరిగింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపునకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది. దేశ వ్యాప్తంగా రెండు దశల్లో జనాభా లెక్కింపు జరగనుంది. 2027, మార్చి నాటికి ఈ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కానుంది. 2026లో లడఖ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అక్టోబర్ 1 నాటికి జన గణన పూర్తి కానుంది. ఇక మిగతా ప్రాంతాల్లో 2027, మార్చి 1 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ తన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: AP Govt: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. వారికి తప్పనిసరిగా బదిలీ!

ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు లెక్కిస్తారు. 2011లో జన గణన జరిగింది. తిరిగి 2020లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ఇంతలో కోవిడ్ మహమ్మారి విజృంభించింది. దీంతో జన గణన ప్రక్రియ నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అంటే మొత్తంగా 16 సంవత్సరాల తర్వాత జన గణన చేపడుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టాయి.

ఇది కూడా చదవండి: యద అందాలతో రెచ్చగొడుతున్న.. నేహా శర్మ

సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోం కార్యదర్శి, రిజిస్ట్రార్ జనరల్ అండ్ భారత జనాభా లెక్కల కమిషనర్, ఇతర సీనియర్ అధికారులతో జనాభా లెక్కలపై సమీక్షించారు. జనాభా లెక్కలతో పాటే కుల గణన వివరాలు సేకరించనున్నారు. ప్రతి రాష్ట్రంలో రెండు దశల్లో జనాభా లెక్కలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. తొలుత ఇళ్లులు గుర్తిస్తారు. అనంతరం ఇంటికి సంబంధించిన పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాలు గురించి వాకబు చేస్తారు. ఇక రెండు దశలో ప్రతి ఇంటిలోని వ్యక్తి వివరాలు, సామాజక-ఆర్థిక, సాంస్కృతిక వివరాలు సేకరిస్తారు. అలాగే కులాన్ని కూడా అడిగి తెలుసుకుంటారు. కులంతో పాటు మతాన్ని కూడా అడిగి తెలుసుకుంటారు.

ఇక వివరాలు సేకరించేందుకు 34 లక్షల మంది పని చేయనున్నారు. 1.34 లక్షల మంది సిబ్బంది పని చేయనున్నారు. ట్యాబ్‌ల ద్వారా వివరాలు సేకరిస్తారు. ప్రభుత్వ యాప్‌ల్లో సొంతంగా కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

 

Exit mobile version