Corona: నాలుగో వేవ్ భయం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని.. కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కొవిడ్ కేసులను ముందస్తుగా గుర్తించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కొవిడ్ ప్రోటోకాల్‌ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కొవిడ్ క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
త్వరలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాత్రలు ప్రారంభం కానున్నాయని, పండుగల సీజన్ వస్తోందని తెలిపారు. దీనివల్ల ప్రజలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని, ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించారు. కరోనా పరీక్షల నిర్వహణ, నిర్ధారణ, వైద్యం, వ్యాక్సినేషన్ వంటివి కొనసాగించాలని లేఖలో స్పష్టం చేశారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్ సమగ్రస్థాయిలో పూర్తిచేసేందుకు కృషి చేయాలని తెలిపారు.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి మే వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి కేేసుల సంఖ్య పదివేలకు మించి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇవాళ 11,793 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 17,073 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆదివారంతో పోలిస్తే దాదాపుగా 45 శాతం పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఇవాళ కేసులు తగ్గుముఖం పట్టాయి.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!