Site icon NTV Telugu

COVID 19: మళ్లీ కోవిడ్‌ టెన్షన్‌.. ఆ రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..

Covid 19

Covid 19

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎంట్రీ తర్వాత థర్డ్‌ వేవ్‌ రూపంలో మరోసారి భారత్‌పై విరుచుకుపడిన కరోనా మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో, కోవిడ్‌ ఆంక్షలను కూడా ఎత్తివేసింది ప్రభుత్వం.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్‌ భూషణ్‌ శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అధికారులకు లేఖ రాశారు రాకేష్‌ భూషణ్‌.

Read Also: Andhra Pradesh: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.879 కోట్లు విడుదల

చైనా, యూఎస్‌లలో కూడా కోవిడ్ కేసుల పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలను తిరిగి తెరవడానికి రాష్ట్రాలు/యూటీలు వివిధ చర్యలను చేపడుతున్నందున, కోవిడ్ 19 నిర్వహణ కోసం రిస్క్ అసెస్‌మెంట్-ఆధారిత విధానాన్ని నిరంతరం అనుసరించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు రాకేష్‌ భూషణ్.. ఈ మేరకు కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ పంపారు. గత వారంలో కేరళలో 2,321 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది భారతదేశంలోని కొత్త కేసులలో 31.8 శాతం.. రాష్ట్రంలో వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 13.45 శాతం నుంచి 15.53 శాతానికి పెరిగింది. టెస్ట్‌, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్‌, టీకాలు వేయడం మరియు కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టం వంటి ఐదు రెట్లు వ్యూహాన్ని కొనసాగించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ లేఖ ప్రకారం.. ఢిల్లీలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 724 కొత్త కేసులు ఉంటే ఏప్రిల్ 8తో ముగిసిన వారానికి వాటి సంఖ్య 826కి పెరిగింది, ఇది దేశంలోని కొత్త కేసులలో 11.33 శాతం. గత వారంలో పాజివిటీ రేటు కూడా 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. ఇక, హర్యానాలో వారంలో ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో 367 కొత్త కేసులు నమోదు కాగా.. 8న ముగిసిన వారంతో 416 కొత్త కేసులు వెలుగు చూశాయి.. ఇది భారతదేశంలోని కొత్త కేసుల్లో 5.70 శాతంగా ఉంది. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 8తో ముగిసిన వారానికి 794 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది దేశంలోని కొత్త కేసుల్లో 10.9 శాతంగా ఉంది.. దీంతో.. ఆ యా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్రం.

Exit mobile version