NTV Telugu Site icon

Kolkata doctor case: వైద్య బృందంతో కేంద్రం చర్చలు.. భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ వైపు మలేరియా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ విజృంభిస్తోంది. దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వైద్య సేవలు 24 గంటలు బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం స్పందించింది. తక్షణమే సమ్మె విరమించాలని కోరింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: The GOAT Trailer : విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?

కోల్‌కతా ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా భారత వైద్య సంఘం శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం 6 గంటల వరకు వైద్య సేవలు బంద్ చేసింది. ఈ క్రమంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం… వైద్యవృత్తిలో ఉన్నవారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది.

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా పోస్టుమార్టం రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఈ రిపోర్టులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూశాయి. ఆమె చాలా హింసకు గురైనట్లుగా అర్ధమవుతోంది. ప్రస్తుతం కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Bulldozer action: ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..