Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కి సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్‌ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి, ప్రస్తుతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సమర్థనీయం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రతిపక్షాలకు అన్ని వివరాలు తెలియజేసినట్లు కేంద్రం చెబుతోంది.

Read Also: Covid-19: 4 వేలపైగా కరోనా కేసులు.. 24 గంటల్లో ఐదుగురు మృతి

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుచున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. 9 ఉగ్రస్థావరాలను నేటమట్టం చేసి 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత, పాక్ కవ్వింపులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది.

అయితే, ఈ దాడుల్లో భారత్ రాఫెల్ విమానాలను కోల్పోయిందని పాకిస్తాన్ ఆరోపించింది. దీనికి తోడు ఆపరేషన్ ప్రారంభంలో తమకు వైమానిక నష్టాలు ఉన్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ అలాంటి ప్రణాళికలు లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version