NTV Telugu Site icon

దీదీకి ఊహించ‌ని షాక్‌..!

Modi

కేంద్రం, ప‌శ్చిమ బెంగాల్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తూనే ఉంది.. తాజాగా, యాస్ తుఫాన్‌పై స‌మీక్ష‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి రావ‌డం.. కేంద్రానికి మ‌రింత కోపం తెప్పించిన‌ట్టుంది.. దీంతో.. దీదీకి ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం స‌మాచారం ఇచ్చింది.. యాస్ తుఫాన్‌పై ప్ర‌ధాని నిర్వ‌హించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.. అయితే, ఈ వ్య‌వ‌హారాన్ని టీఎంసీ త‌ప్పుబ‌డుతోంది.. ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా డెప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని మండిప‌డుతున్నారు టీఎంసీ నేత‌లు.

కాగా, 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన‌ ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను తాము ఉప‌యోగించ‌ద‌ల‌చుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింద‌ని ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్రం నిన్న సమాచారం పంపింది. తక్షణమే రిలీవ్​ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈనెల 31న ఢిల్లీలోని డీవోపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని బందోపాధ్యాయ్‌కు సూచించింది. అయ‌తే, మే 31 నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండనున్నాయి… ఆయ‌న పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం 6 నెలల పాటు పెంచాలని కోరుతూ ఇప్ప‌టికే ప్రధానికి లేఖ రాశారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ మేరకు మూడు నెలల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది… ఇప్పుడు కేంద్ర‌మే పిల‌వ‌డంతో.. ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముంద నుంచీ దీదీ, కేంద్రం మ‌ధ్య వార్ న‌డుస్తోంది.. ఎన్నిక‌ల ముగిసినా.. అది కొన‌సాగుతూనే ఉంది.