దీదీకి ఊహించని షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం, పశ్చిమ బెంగాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా, యాస్ తుఫాన్‌పై సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం.. కేంద్రానికి మరింత కోపం తెప్పించినట్టుంది.. దీంతో.. దీదీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం సమాచారం ఇచ్చింది.. యాస్ తుఫాన్‌పై ప్రధాని నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అయితే, ఈ వ్యవహారాన్ని టీఎంసీ తప్పుబడుతోంది.. ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా డెప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని మండిపడుతున్నారు టీఎంసీ నేతలు.
కాగా, 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను తాము ఉపయోగించదలచుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం నిన్న సమాచారం పంపింది. తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈనెల 31న ఢిల్లీలోని డీవోపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని బందోపాధ్యాయ్‌కు సూచించింది. అయతే, మే 31 నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండనున్నాయి… ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం 6 నెలల పాటు పెంచాలని కోరుతూ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు సీఎం మమతా బెనర్జీ.. ఈ మేరకు మూడు నెలల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది… ఇప్పుడు కేంద్రమే పిలవడంతో.. ఆసక్తికరంగా మారింది. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముంద నుంచీ దీదీ, కేంద్రం మధ్య వార్ నడుస్తోంది.. ఎన్నికల ముగిసినా.. అది కొనసాగుతూనే ఉంది.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!