బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిణామాలు భయాందోళనగా మారాయి. హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ హింస కొనసాగుతోంది. హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అనేక మంది భారత్‌లోకి ప్రవేసించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనారిటీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: YVS Chowdary: ఒకే సామాజిక వర్గ హీరోలతో సినిమాలు.. వైవీఎస్ చౌదరి షాకింగ్ ఆన్సర్
బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులు, హిందువులతో పాటు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు సంబంధించి అక్కడి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బీఎస్‌ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో దక్షిణ బెంగాల్, త్రిపుర విభాగాల బీఎస్‌ఎఫ్ ఐజీ స్థాయి అధికారులు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: YVS Chowdary: వైవీఎస్ చౌదరి – నందమూరి తారక రామారావు సినిమాకి ఆస్కార్ గ్రహీతలు
ఇదిలా ఉంటే షేక్ హసీనా 15 ఏళ్ల ప్రభుత్వం తర్వాత గురువారం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనస్ వ్యవహరించనున్నారు.