Site icon NTV Telugu

Centre: కేంద్రం షాకింగ్‌ నిర్ణయం.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్

Youtube

Youtube

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్‌ చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. వీటిలో 10 భారతీయ వార్తా ఛానెళ్లు ఉండగా.. 6 పాకిస్థాన్‌ ఆధారిత యూట్యూబ్ వార్తా ఛానెళ్లు ఉన్నట్టు ప్రకటించింది.. భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చర్యలు తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. భారతదేశంలో భయాందోళనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని ప్రేరేపించడానికి పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఆధారిత వార్తా ఛానెళ్ల వీక్షకుల సంఖ్య 68 కోట్లకు పైగా ఉందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ పేర్కొంది.

Read Also: Revanth Reddy: కేసీఆర్‌-పీకే భేటీపై రేవంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

Exit mobile version