NTV Telugu Site icon

NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్‌ని కోరిన కేంద్రం..

Neet

Neet

NTA: నీట్, యూజీసీ-నెట్ పరీక్షా పత్రాలు లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పారదర్శకతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌టీఏ పనితీరు, పారదర్శకతపై కేంద్రం ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్, నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏని ఎలా సంస్కరించాలనే దానిపై తల్లిదండ్రుల నుంచి కేంద్రం సలహాలు కోరింది. వెబ్‌సైట్ – https://innovateindia.mygov.in/examination-reforms-nta/ ద్వారా సూచనలను సలహాలను స్వీకరించనుంది. జూలై 07 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

Read Also: Somu Veerraju: కాంగ్రెస్ పార్టీలో అహంకార ధోరణి కనిపిస్తుంది..!

ఇటీవల నీట్, యూజీసీ – నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ నెట్ పేపర్ డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షం కావడంతో పరీక్షలను రద్దు చేశారు. ఈ పేపర్ లీకును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అవకతవకలపై నిరసన తెలియజేస్తోంది. ఈ రోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో నీట్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ప్రధాన సూత్రధారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.