NTV Telugu Site icon

Puja khedkar: పూజా తల్లిదండ్రుల వైవాహిక వివరాల్ని అడిగిన కేంద్రం

Iaspujakhedkar

Iaspujakhedkar

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమె శిక్షణను యూపీఎస్సీ నిలిపివేసింది. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాజాగా ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితి వివరాలను ఇవ్వాలని పూణె పోలీసులను కేంద్రం కోరింది. పూజ ఖేద్కర్ తల్లిదండ్రులు… తల్లి మనోరమ, తండ్రి దిలీప్ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు పూణె పోలీసు సీనియర్ అధికారి ఓ మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Bahishkarana: అతనితో పని చేయడం కిక్కిస్తుంది.. అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు

గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమెపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో బదిలీ చేసింది. అనంతరం ఆమెపై మరింత విమర్శలు వెల్లువెత్తాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్ సర్టిఫికెట్ వరకు అన్ని నకిలీవేనని ఆరోపణలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆమె శిక్షణను నిలిపివేసింది. అలాగే యూపీఎస్సీ కూడా రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు తిరిగి పిలిపించారు. ప్రస్తుతం ఆమెపై విచారణ జరుగుతుంది. ఆరోపణలు రుజువైతే ఐఏఎస్ ఉద్యోగాన్ని కోల్పోవల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: CAT: మాల్లో సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్న పిల్లి.. ఇదెక్కడి వింత రా బాబు..!