NTV Telugu Site icon

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు

Sarogacy

Sarogacy

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవు కూడా తీసుకోవచ్చు. అయితే అతనికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ 18 నుంచే ఇవి అమలులోకి వచ్చాయి.

Read Also: PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు

పర్సనల్ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన సవరించిన నిబంధనల ప్రకారం.. ‘సరోగసీ విషయంలో, సరోగసీతో పాటు అలాగే ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న తల్లికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయవచ్చు. కాగా.. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధన ఇంత వరకు లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బతికి ఉన్న ఇద్దరు పెద్ద పిల్లల సంరక్షణ కోసం మొత్తం సేవా వ్యవధిలో గరిష్టంగా 730 రోజుల చైల్డ్ కేర్ లీవ్.. ‘ఒక మహిళా ప్రభుత్వోద్యోగికి, ఒక మగ ప్రభుత్వ ఉద్యోగికి’ అందించబడుతుంది. తాజాగా.. మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనలలో స్పష్టం చేసింది.

Read Also: Meenakshi Chaudhary: స్టార్‌ కమెడియన్‌ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!