Site icon NTV Telugu

COVID 19: కేంద్రం హెచ్చరికలు.. ప్రజల్లో మళ్లీ ఆందోళన..!

ఇక కరోనా మహమ్మారి పని అయిపోయింది.. థర్డ్‌ వేవ్‌ తర్వాత వినిపించిన మాటలు ఇవి.. మహమ్మారి పోదు.. కానీ, బలనహీనపడి.. సాధారణ స్వరంలా ఎటాక్‌ చేస్తుందని చెప్పిన పరిశోధనలు కూడా ఉన్నాయి.. అయితే, దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జనం అప్రమత్తంగా ఉండకపోతే… కోవిడ్‌ వ్యాపిస్తుందనే వార్తలు మళ్లీ అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెల్త్‌ వేరియంట్‌ రూపంలో… ముప్పు పొంచి ఉందంటున్నారు. ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గిపోతుండటంతో అందరూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కథ ముగిసిపోయినట్లేనని సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే, ఇదే సమయంలో కరోనా కథ ఇంకా అయిపోలేదని వార్నింగ్‌ ఇస్తున్నారు.

Read Also: Ukraine Russia War: రంగంలోకి ఆత్మాహుతి డ్రోన్లు..!

మరోవైపు, చైనాలో పెరుగుతున్న కేసులను చూస్తుంటే.. భారత్‌కు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదు. ఈసారి కరోనా ఏకంగా 75 శాతం మందిపై విరుచుకుపడొచ్చని కొవిడ్-19 టాస్క్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా హెచ్చరించారు. ఇక, ఇప్పటికే కరోనా బీఏ.2 వేరియంట్ వల్ల దేశంలో మూడో వేవ్ వచ్చింది. ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు జులైలో నాలుగో వేవ్ దశ ప్రారంభమవుతుందని ఐఐటి ఖరగ్ పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి.. కరోనా ముగిసిపోయిందనుకునే లోపే..మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు జనం.. కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఆంక్షలు ఎత్తివేసి.. సాధారణ జీవితం గడుపుతోన్న సమయంలో.. కేంద్రం వార్నింగ్‌లు మళ్లీ కలవరానికి గురిచేస్తున్నాయి.

Exit mobile version