Site icon NTV Telugu

Booster Dose: బూస్టర్ డోస్‌కు కొత్త నిబంధనలు.. 9 నెలలు అవసరం లేదు..!

Vaccine

Vaccine

కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఫస్ట్ డోస్‌, సెకండ్‌ డోస్‌ తర్వాత ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఫస్ట్ అండ్ సెకండ్‌ డోస్‌ వేసుకుని బూస్టర్‌ డోస్‌ కోసం వేచిచూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం.. కోవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించింది ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క రెండో డోస్‌.. బూస్టర్‌ డోస్‌ మధ్య గ్యాప్‌ 9 నెలలుగా ఉండగా.. దానిని ఆరు నెలలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ సలహా సంఘం-ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI).. రెండో డోస్‌ మరియు బూస్టర్ డోస్ మధ్య అంతరాన్ని తగ్గించాలని సిఫార్సు చేసింది.

Read Also: Revanth Reddy: కేసీఆర్‌‌ను 2 వేల నోట్ల మీద కాలిస్తే.. ఇంకా డబ్బులు మిగులుతాయి

దీంతో.. ఈ రెండు డోసుల మధ్య ఉన్న 9 నెలల వ్యవధిని.. ఇప్పుడు 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లో రెండో డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత 18-59 సంవత్సరాలు బూస్టర్‌ డోస్‌ వేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.. దీనిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక లేఖ రాశారు.. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ లేఖలను పంపింది కేంద్రం.. ఇక, 60 ఏళ్లు, ఆపై వయస్సు వారికి, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రభుత్వ సీవీసీల్లో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ తర్వాత 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన వెంటనే బూస్టర్‌ డోస్‌ ఇవ్వబడుతుందని.. వారికి ఇది పూర్తిగా ఉచితమని లేఖలో పేర్కొంది కేంద్రం.

Exit mobile version