Site icon NTV Telugu

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక చట్టం పరిధి కుదింపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ ప‌వ‌ర్స్ యాక్ట్) పేరుతో ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను కుదిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కాగా ప్రత్యేక చట్టం పరిధిని కుదిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న అనేక ఒప్పందాలు, నిరంతర ప్రయత్నాల కారణంగా ఏఎఫ్‌ఎస్‌పీఏ పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని అమిత్ షా అన్నారు.

Exit mobile version