Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

Ahmedabad Plane Crash

Ahmedabad Plane Crash

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా కూల్చేయాలని సూచించింది. భవన యజమానికి అభ్యంతరాలుంటే 18 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం..సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ అధికారులు భవనాలు లేదా చెట్లను స్వయంగా కూల్చే అధికారం కల్పించింది. ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలు ,వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణంగా తొలగించవచ్చని కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు కూడా మృతిచెందారు. పలువురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీని అధికారులు ఛేదిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kerala High Court: కేరళ హైకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై సామాన్యులు పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లను ఉపయోగించలేరు

Exit mobile version