Site icon NTV Telugu

Ministry of Law: ఇకపై సుప్రీం మాజీ సీజేఐకి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్

Supreme Judges

Supreme Judges

Ministry of Law and Justice: ఇక నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్‌ను కేటాయించే విధంగా కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తించనుంది. ఆ మేరకు నిబంధనలు మారుస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత 6 నెలలు ఉచిత నివాసం కల్పించే సౌకర్యాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో 6 నెలలు ఉచిత బంగ్లాతో పాటు, ఒక ఏడాది పాటు భద్రత, వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్ సౌకర్యం కల్పించారు.

Indian Airforce: బ్రహ్మోస్ క్షిపణి మిస్ ఫైర్‌.. ముగ్గురు అధికారుల తొలగింపు

ఈ సౌకర్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులకు కూడా విమానాశ్రయాల్లో శాశ్వత ప్రాతిపదికన ”ప్రోటోకాల్” కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Exit mobile version