Site icon NTV Telugu

ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్

Modi

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్‌ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది.

read more : ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్!

మిత్రపక్షాలతో పాటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఉత్తర్‌ప్రదేశ్‌ సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. మధ్యప్రదేశ్‌ నుంచి జోతిరాధిత్య సింధియా, రాకేశ్‌ సింగ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీహార్‌ నుంచి ఎల్జేపీ నేత పశుపతి కుమార్‌ పరాస్‌, యూపీ నుంచి అప్నాదళ్‌ నాయకురాలు అనుప్రియ పటేల్‌, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ, మహారాష్ట్ర నుంచి పూనం మహాజన్‌, ప్రీతం ముండే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Exit mobile version