ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 11 ఏళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేశామని.. వారిని ఎంతగానో గౌరవించినట్లు బీజేపీ శ్రేణులు ప్రకటించారు. తాజాగా నారీమణులకు కేంద్రం మరో శుభవార్త చెప్పుబోతుంది. 2029లో జరిగి లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్
ఇటీవలే 2027, మార్చి నాటికి జనాభా లెక్కలు, కుల గణన పూర్తి చేస్తామని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా డీలిమిటేషన్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనిపై కూడా కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. వీటిన్నింటినీ చాలా వేగంగా పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇవన్నీ పూర్తైతే.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒక క్లారిటీ వస్తుందని భావిస్తోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు (నూట ఇరవై ఎనిమిదవ సవరణ)ను సెప్టెంబర్ 19, 2023న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2029 ఎన్నికల నాటికి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది. అదే గనుక జరిగితే లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్ అమలులోకి వస్తుంది.
ఇది కూడా చదవండి: Schools Reopen : వేసవి సెలవులకు గుడ్‌బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
నారీ శక్తి వందన్ అధినియం అని పిలువబడే ఈ బిల్లు డీలిమిటేషన్‌తో ముడిపడి ఉంది. నియోజకవర్గాల పునర్విభజనం పూర్తైతే దాదాపుగా కేంద్రానికి ఒక క్లారిటీ రానుంది. దీన్ని భేష్ చేసుకుని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని చూస్తోంది. నూటికి నూటి శాతం వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఇక డీలిమిటేషన్‌తో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేయబడిన సీట్లను కూడా నియమిస్తారు.
అయితే డీలిమిటేషన్‌పై తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆందోళన చేస్తోంది. డీలిమిటేషన్‌తో రాష్ట్రం నష్టపోతుందని డీఎంకే వాదిస్తోంది. లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని.. దీంతో రాష్ట్రం తీవ్రంగా దెబ్బ తింటుందని ఫైట్ చేస్తోంది. అయితే డీఎంకే వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా తగ్గదని తేల్చి చెప్పారు.
