Site icon NTV Telugu

Petrol-Diesel price: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. వదంతులపై కీలక ప్రకటన!

Petroldieselprice

Petroldieselprice

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటీవల గృహ, వాణిజ్య వినియోగ గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వదంతులు చెలరేగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముడి చమురు ధర పెరిగినప్పటికీ ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేనట్లుగా కేంద్ర వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధరల పెరుగుదల ప్రభావాన్ని ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరించాలని కేంద్రం సూచించినట్లు సమాచారం. కేంద్ర నిర్ణయం వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించినట్లే.

ఇది కూడా చదవండి: Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్

గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో తీవ్రంగా యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇక హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు రవాణా నిలిచిపోయింది. ఈ కారణంగాఒక్కసారిగా ముడి చమురు ధర పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ధరలు పెరగకుండా కేంద్రం నిలుపుదల చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ పరిణామాలను బట్టి ధరలు పెంచాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇలానే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవు.

ఇది కూడా చదవండి: Stock Market: స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. భారీ నష్టాల్లో సూచీలు

Exit mobile version