Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో ఘోరం.. కారు ఢీకొని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి దుర్మరణం

Delhibmwcar

Delhibmwcar

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి నవతోజ్ సింగ్ దుర్మరణం చెందారు. హరినగర్ నివాసి అయిన నవతోజ్ సింగ్ ఇంటికి వస్తుండగా బైక్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదస్థలిని నవతోజ్ సింగ్ ప్రాణాలు కోల్పోగా.. భార్య తీవ్రంగా గాయపడింది. ప్రమాద సమయంలో కారును ఒక మహిళ డ్రైవింగ్ చేస్తున్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Mega DSC 2025: మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల..

ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్‌లో ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి నవతోజ్ సింగ్ మోటార్‌సైకిల్‌‌పై ఇంటికి వెళ్తున్నారు. కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆయన మరణించగా.. ఆయన భార్య మాత్రం తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నవతోజ్ సింగ్(52) బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్

ప్రమాదం జరగగానే తల్లిదండ్రులను సమీపంలోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లకుండా.. 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్‌లోని న్యూలైఫ్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు ఆరోపించారు.   ప్రమాదం జరిగించిన మహిళ ఎక్కడుందో తెలియదని.. తప్పించుకునేందుకు నకిలీ మెడికో లీగల్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకుంటుందని నవజ్యోత్ సింగ్ కుమారుడు ఆరోపించాడు. ఇక కారు నడుపుతున్న మహిళను గగన్‌ప్రీత్‌గా గుర్తించారు. ఆమె భర్త పరీక్షిత్ ప్యాసింజర్ సీట్లో ఉన్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మహిళ, ఆమె భర్తకు గాయాలు అయ్యాయని.. వెంటనే ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలిని క్రైమ్ బృందం, ఫోరెన్సిక్ బృందం పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version